పాలకు ఒక పద్దతి ప్రకారం తీసుకొంటే మంచిది అంటారు డైటీషియన్లు.పాలల్లో కాల్షియం,పోటాషియం,విటమిన్ బి12,విటమిన్ D లు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను ,పళ్ళను దృఢంగా ఉంచుతాయి.రోగ నిరోధక శక్తి పెంచుతాయి. ఇవి చర్మానికి వెంట్రులకు మేలు చేస్తాయి.వీటిలో ఉండే న్యూట్రియంట్స్ శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడతాయి. చర్మం సాగకుండా గీతలు పడకుండా ఉంటుంది. స్కిమ్డ్ లేద తక్కువ కొవ్వు ఉన్న పాలను తాగటం ద్వారా బరువును నియంత్రించవచ్చు అంటారు డైటిషియన్లు. పాలు గనుక పడక పోతే సోయా,ఆల్మండ్ పాలు కూడా మంచివే. పాలు అస్సలు ఇష్టపడని వాళ్ళు ,పాలకు బదులుగా చికెన్ ,ఫిష్ ,ఎగ్, పెరుగు,సోయా మొలకెత్తిన ధాన్యాలతో ఆరోగ్యంగా ఉండచ్చు.

Leave a comment