పిల్లల ఆటలు,వాళ్ళ పరుగులు ,ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టటం చూసి తల్లిదండ్రులు హడలి పోతుంటారు .ఒక్క రోజులో కనీసం మూడు వందలసార్లు వాళ్ళ నోట్లోకి చేతులు వెళ్ళిపోతాయంటే ఆశ్చర్యం ఏముంది. ఆడతారు ,సైకిల్ తోక్కుతారు,పెంపుడు జంతువులు ఉంటే ఇంకా చెప్పేపని లేదు.ఎక్కడ మురికిలో అయినా గుబుక్కున భయంలేకుండా చేతులు పెడారు.మరి ఇన్నీ సార్లు పిల్లల చేతులు యాంటీ బాక్టిరియల్ తో తుడవటం సాధ్యామా? పది నిమిషాలకు ఒక సారి వాళ్ళను సింక్ దగ్గరకు లాక్కుపోవటం కూడా అవదు.కానీ అంత శ్రమ పడనక్కర్లేదు. ఆటలాడక బాత్ రూమ్ కు వెళ్ళక ,ఆటలు ముగిశాక మామూలు సబ్బుతో 20 సెకన్ల పాటు కడిగితే చాలు .ఒక వేళ సూక్ష్మజీవులు దాక్కుని కడుపెలోకి వెళ్ళినా పెద్ద నష్టం లేదు. అవి మేలు చేస్తాయి అలా వదిలేయండి అంటగారు డాక్టర్లు.

Leave a comment