చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మా!!
బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన!

సఖులారా!! ఈ రోజు మొదలు పండుగలే పండుగలు కదా!! దసరా,బతుకమ్మ, రండి సరదా సరదాగా ఈ రోజు బతుకమ్మను అందంగా తయారు చేసి ఆడుకుందామా!!
గునుగు పూలు,తంగేడు పూలు, జిల్లేడు పూలు ఇంకా రకరకాల పూలతో అందంగా పేర్చి, పసుపు గౌరమ్మను పెట్టి ముతైదువులు అందంగా అలంకరించుకుని
“ఏమేమీ పూవప్పునే  గౌరమ్మ..ఏమేమి కాయప్పునే గౌరమ్మ”..అంటూ ఆడి పాడి బతుకమ్మ కు హారతి ఇచ్చి, నైవేద్యం పెట్టి చెరువులోని నీళ్ళలో వదులుతారు.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు,పుట్నాల పప్పు  పంచదార కలిపి నైవేద్యం.

            -తోలేటి వెంకట శిరీష  

Leave a comment