Categories
![నయన తార ని లేడీ సూపర్ స్టార్ అంటారు. ఇప్పటికే దూర ఇమై క్కనొడిగల్ ,అరమ్ కొలై ఉదిర్ కాలమ్ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది నయన. అలాగే ఈరోజు ఇంటెర్నేష్నల్ సంస్థ నిర్మిస్తున్న రియలిస్టిక్ థ్రిల్లర్ లోనూ నయన కధానాయిక. ఇక తాజాగా ఆమె ఒప్పుకున్నా సినిమాకు భరత కృష్ణమా చారి దర్శకుడు. ఇందులో తన కుటుంబ మూలాలు వెతుక్కుంటూ వెళ్లే జర్నలిస్ట్ పాత్రను నయన చేయనుంది. ఈ సినిమా చిత్రీకరణ అంతా మాంగోలియా లోని మంచు ప్రాంతాల్లో తీస్తున్నారు. పది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత లో షూటింగ్ చేస్తున్నారు. సౌత్ లో ఈ సినిమా నయనా తార కు గొప్ప హిట్టవుతుంది. రిస్కీ వాతావరణం లో రిస్కీ ఫైట్స్ ఆమె చేయగలరు. అంటున్నారు దర్శకుడు భరత్. ఇవన్నీ చూస్తుంటే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు నయన మాత్రమే చేయగలదనే భావన అందరికీ వస్తోంది.](https://vanithavani.com/wp-content/uploads/2017/01/Nayantara.jpg)
నేను కొత్తగా ఏం చేస్తున్నాను. నటనలో నేను సాధించవలిసిన మెట్లు ఎన్నున్నాయి అని ప్రశ్నించుకున్నాను. అప్పుడిక అమ్మాయిలను గౌరవించే పాత్రలనే చేయలనిపించింది అంటుంది నయనతార. అలాంటి స్క్రిప్టులు వినటం మొదలుపెట్టాను. నా ఇష్టాన్ని ఆలోచనను ప్రేక్షకులు స్వాగతించారు.నా సినిమాలు ఆదరించారు. అలాంటి సినిమా నిర్మించేవాళ్ళు ముందుకొచ్చారు. మహిళ ప్రాధాన్యం గల సినిమాల సంఖ్య ఇప్పుడు పెరుగుతుంది. ఇందుకు ప్రేక్షకులకు కృతజ్ఞ్తలు చెప్పాలి అంటుంది నయనతార. సినీ పరిశ్రమ ప్రేక్షకుల అభిరుచి జడ్జిమెంట్ల పైనే ఆధారపడి ఉంటుంది. మంచి సినిమాలు అందున స్త్రీ ప్రాధాన్యత కలిగిన సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకులే కారణం అంటుంది నయనతార.