Categories
కోపాన్ని దూకుడుతనాన్ని కంట్రోల్ చేయడానికి మెదడుకి చాలా శక్తి కావాలి. ఆ శక్తి ఇచ్చేది గ్లూకోజ్. అది తగ్గితే సహజంగా నియంత్రణ శక్తిపోతుంది.అందుకే ఆకలేస్తే చాలా కోపం వచ్చేస్తుంటుంది. జంక్ ఫుడ్ ,పాస్ట్ ఫుడ్ లో ఎక్కువ కేలరీలుంటాయి. వాటిలో శక్తినిచ్చేవి ఉండవు. దీంతో మెదడుకు కావల్సిన సూక్ష్మపోషకాలు అందవు. పిల్లలు తవరగా అలసిపోతారు. వ్యాయామం ఆటలు ఆడలేరు. పిల్లలి నిరంతరం పేచి పెడుతున్నారు అంటే వారికి కావల్సిన పోషకాలు అందడంలేదని అర్ధం చేసుకోవాలి. పిల్లలకిచ్చే అహారంలో పోషకాలు,పీచు ఉండాలి. జంక్ ఫుడ్ తో ఊబకాయం వస్తుంది కాని వారికి శక్తి రాదు. పోషకాహారలోపం వల్ల పిల్లల శక్తి చాలక చదువు పై దృష్టి పెట్టలేరు.