Categories
వంకీల జుట్టు ఎప్పుడు అందం. ఒత్తుగ స్టయిల్ గా ఉంటుంది అయితే ఈ జుట్టు వత్తుగా వుండి మాడు వరకు గాలి తగలక చమట పెట్టేస్తూ వుంటుంది. అందుకే ఇలాటి జుట్టు వుంటే తలంతా కప్పేసు కోకూడదు. తలస్నానానికి ముందు కండిషనింగ్ ఆయిల్ పట్టించి మర్దన చేయాలి. షాంపూల ఎంపికలో శ్రద్ధ తీసుకోవాలి. రోజు తలస్నానం అలవాటుంటే మానుకోవాలి. మూడు రోజులకోసారి చాలు. జుట్టు పూర్తిగా ఆరిపోనిచ్చి దువ్వు కోవాలి హెయిర్ డ్రైయర్లు వాడక పోవటం మంచిది. పళ్ళ మధ్య ఎడం ఎక్కువగా వుండే దువ్వెన ఉపయోగించాలి.