తామర పువ్వుల అందమే అందం. కానీ ఆ ఆకులలో పుష్కలంగా ఉండే ఫ్లేవనాయిడ్లు ఎంతో ఆరోగ్యం అంటున్నారు ఎక్సపర్ట్స్. ప్రాచీన మూలికా వైద్యంలో ఈ ఆకులను వడదెబ్బ, డయేరియా వంటి ఆరోగ్య సమస్యలకు మందుగా వాడేవారు. తామరాకులలో ఆహారం ఉంచి ఆవిరిపై ఉడికిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కొన్నిచోట్ల తామరాకులతో చేసిన టీ కూడా తాగుతారు. అరటి ఆకులకు ప్రత్యామ్నాయంగా భోజనాలు చేసేందుకు ఏదైనా పదార్థాలు ప్యాక్ చేసేందుకు వాడుతారు.

Leave a comment