గ్రామీ అవార్డ్ ల నామినీల్లో భారతదేశ మూలాలున్నా నేహా మహాజన్ వచ్చి చేరింది .సితార్ కళాకారిణి నేహా మోడలింగ్, సినిమా రంగాల్లోనూ రాణిస్తోంది.ప్రముఖ సితార్ విద్వాన్సుడు పండిత్ విదుర్ మహాజన్ కూతురుగా ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకొంది  నేహా మహాజన్.పూణే విశ్వవిద్యాలయంలో ఫిలాసఫీ లో మాస్టర్స్ చేసింది మొదట్లో తండ్రితో కలసి కచేరీ లు చేసే నేహా సోలో గా కూడా తన ప్రత్యేకత సంపాదించుకుంది దీపా మెహతా దర్శకత్వం వహించిన మిడ్ నైట్ చిల్డ్రన్ లో వెండితెర ప్రవేశం చేసింది.తాజాగా పాప్ గాయకుడు రిక్కీ మార్టిన్ రూపొందించిన ‘పౌసా’ ఆల్బమ్ లో మి సంగ్రే పాటకు సహ కళాకారిణి గా పనిచేసి గ్రామీ నామినీల జాబిదా లో చేరింది నేహ మహాజన్.

Leave a comment