జుట్టూ చిన్న వయసులోనే తెల్లబడటం కూడా వారసత్వం కారణం గానే అంటున్నారు ఎక్స్ పర్ట్స్. తల్లిదండ్రులకు చిన్నవయసులోనే తెల్లబడితే పిల్లలకు అదే వారసత్వం గానే వస్తుంది. హెయిర్ కలరింగ్ కాకుండా తెల్లజుట్టూను, నలుపు చేసే ప్రక్రియ ఏదీ లేదు. అయితే పోషకాహార సప్లిమెంట్స్ ప్రోటీన్స్, పెడేడ్లు, విటమిన్ బి 12 వంటివి, కాల్షియం, జింక్ తెల్లబడే ప్రక్రియను నెమ్మదింప చేస్తాయి. ఒక వారసత్వంగా వచ్చిన తెల్లజుట్టూ కాకపోతే జీవన శైలి, వత్తిడి, స్టైలింగ్ ఉత్పత్తులు ఎక్కువగా వాడటం, ఆహార లోపాలు, సుర్యకిరణాలకు ఎక్కువగా ఎక్స్ పోస్ కావటం కూడా కొంత కారణం కావచ్చు. జుట్టూ పల్చబడుతూ ఉంటే పోలికల్స్ బలహీనత కావచ్చు. ఆయిల్స్ జుట్టూకు కండీషన్ అందిస్తాయి. జుట్టూ కుదురుకు పునరుత్తేజం కలిగిస్తాయి. బి12, విటమిన్ సి , సెలీనియం , జింక్, కాపర్ ఎసెన్షియల్ ప్యాటీ యాసిడ్స్ జుట్టూ రాలటాన్ని అరికట్టడంలో సిఫార్స్ చేస్తుంది.
Categories