Categories
ఈ సంవత్సరం దేశ నాలుగో అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందుకున్నారు వనదేవత తులసి గౌడ్. ఔషధ మొక్కల భిన్నమైన ఎన్నో జాతి మొక్కల పట్ల పరిపూర్ణమైన పరిజ్ఞానం ఉన్న 72 సంవత్సరాల తులసి గౌడ్. తన ఉద్యోగ కాలంలో 40 వేల వృక్షాలను పెంచి వన సామ్రాజ్యాన్నే నెలకొల్పారు గత ఆరు దశాబ్దాలుగా పర్యావరణానికి ఆమె చేసిన సేవలు వల్లనే ఆమెకి అత్యున్నత గౌరవం దక్కింది ఈ వయసులోనూ తులసి అలసట లేకుండా మొక్కలు నాటుతారు తనకు వచ్చే పింఛను మొత్తాన్ని అటవీ సంరక్షణ కోసమే ఏర్పాటు చేస్తారు. మహా వృక్షాలను పెంచే తులసి కనీసం బడి చదువులు కూడా చదువుకోలేదు.