భూపాల్ కు చెందిన ఇరవై నాలుగేళ్ల జాగ్రతి అవస్థి యు పి ఎస్ సీ పరీక్షల్లో దేశంలోనే రెండవ ర్యాంకర్ గా నిలిచింది మహిళల్లో ఆమెదే ఫస్ట్ ర్యాంక్ మౌలనా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 2017 లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది.  ప్రతిష్టాకరమైన గేట్ పరీక్ష లోను మంచి ర్యాంకు సాధించింది. ముందుగా బి హెచ్ ఈ ఎల్ లో ఇంజనీర్ గా పనిచేసిన అవస్థి ఇంటి దగ్గర శ్రద్ధగా చదివి పరీక్షలు రాసింది. దేశానికి ఎలాంటి సేవలు అందిస్తావన్న ప్రశ్నకు మన దేశం పల్లెపట్టు లకు నెలవైన దేశం అందుచేత గ్రామాభివృద్ధి తన లక్ష్యమంటూ వినయంగా జవాబు ఇచ్చింది జాగ్రతి అవస్థి .

Leave a comment