వర్షాకాలానికి తగినట్లు దుస్తులు ధరించకపోతే అంతా అసౌకర్యమే అంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. కాటన్ టీ షర్ట్, కాటన్ ప్యాంట్లు కుర్తా లెగ్గింగ్స్ వంటివి సౌకర్యంగా ఉంటాయి జార్జెట్ రేయాన్ చేనేత రకాలు ఈ వర్షాలకు అనువుగా ఉంటాయి. రేయాన్ తేలికైన వస్త్రం దీనిపై డెనిమ్ జాకెట్ సరైన మ్యాచింగ్ అలాగే జార్జెట్ త్వరగా ఆరిపోయి ధరించేందుకు తేలికగానూ ఉంటాయి. కాంతివంతమైన వర్ణాలు మబ్బుగా ఉండే వాతావరణానికి ఉత్సాహం ఇస్తాయి. ఫాన్సీ నగలు, వాటర్ ప్రూఫ్ వాచీలు, పూసల బ్రాస్ లెట్స్ పొడవైన జుంకాలు బాగుంటాయి. మెటాలిక్ జ్యువలరీ కి దూరంగా ఉండాలి నడిచేందుకు సౌకర్యంగా ఉండే వాటర్ ఫ్రెండ్లీ ఫ్లిప్ ఫ్లాప్స్ వంటివి త్వరగా ఆరిపోయి నడిచేందుకు సౌకర్యంగా ఉంటాయి.

Leave a comment