అస్సాం కు చెందిన హేమ ప్రభ చుటియా వస్తాం పైన చిత్రాలు వేయగలరు. సిల్క్ వస్త్రం పైన ఆమె ఆధ్యాత్మిక చిత్రాలు నిక్షిప్తం చేస్తారు. శ్రీమంత శంకర్ దేవ్ రచించిన గుణమాల, శ్రీ మాధవ దేవ్ అస్సామీ లో రాసిన నామ్ ఘోసా వైష్ణవ గ్రంధాన్ని ఆమె సిల్క్ వస్త్రంపై నేశారు. 280 గజాల పొడవు, రెండు అంగుళాల వెడల్పు ఉన్న ఈ వస్త్రం పై మూడేళ్ల పాటు కష్టపడి ఈ ఆధ్యాత్మిక గ్రంథాలు నేశారు.ఈ అరుదైన నైపుణ్యమే ఆమెకు పద్మశ్రీ ని తెచ్చి పెట్టింది.

Leave a comment