Categories

ఆఫీస్ పని తో ఆందోళన పడే యువతుల కు అశ్వగంధ టీ అలసట తీరుస్తుంది. పలు రకాల వైద్య గుణాలు ఉన్న అశ్వగంధ ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. కప్పు నీళ్లలో పావు చెంచా అశ్వగంధ వేసి మరగబెట్టి వడకట్టి అందులో స్పూన్ నిమ్మరసం, తేనె కలిపి నిద్రపోయే ముందు తాగితే ఒత్తిడి ఆందోళన కుంగుబాటు వంటివి తగ్గుతాయి. కంటినిండా నిద్ర పోవచ్చు ఈ టీ లోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరం లోని జీవక్రియలను వేగవంతం చేస్తాయి.