ఎసెన్షియల్ ఆయిల్స్ ,హెర్బల్స్ అత్యంత సువాసన భరితమైనవే కాని ఇవి స్వేదాన్ని, దుర్వాసనను తొలగించలేవు. కేవలం పరిమళం ఇస్తాయి. వీటి గురించి చర్మం చమటలు లేకుండా పొడిగా ఉంటుందని దుర్వాసన రాదని ప్రచారం చేస్తారు కాని ఇందులో టిట్రీ అయిల్ నుంచి బేకింగ్ సోడా,అలోవెరా వరకు అన్ని ఉపయోగిస్తారు. ఎన్ని పదార్ధాలు ఉన్నా స్వేదం తగ్గించగల పవర్ అల్యూమినియంలో ఉంది. ఇది యాంటీ పరిస్పిరెంట్ లో ఉంటుంది. బేకింగ్ సోడా దుర్వాసన పీల్ల్చుకుంటుంది. టిట్రీ అయిల్ లో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అలోవెరా ఇరిటేటెడ్ చర్మానికి ఉపశమనం ఇస్తుంది. ఏ సువాసన ఇచ్చే ఉత్పత్తిని ఎంచుకొన్న అందులో వాడిన పదార్ధాలు వస్తువులు చూడటం ముఖ్యం.

Leave a comment