Categories
మాంసాహారుల కన్నా శాఖాహారులకే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు ఎక్సపర్ట్స్. 50 వేల మంది పై 18 ఏళ్ళ పాటు జరిగిన ఒక అధ్యయనం లో శాకాహారుల్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం 20 శాతం అధికంగా ఉన్నట్లు కనిపెట్టారు. శాకాహారుల్లో మెదడు మెదడు రక్త నాళాల గుండా తక్కువ కొలెస్ట్రాల్,బి -12 వంటి విటమిన్లు తక్కువగా ప్రవహించటం వల్ల రక్త నాళాలు చీలిపోయే అవకాశం ఎక్కువగా ఉందని వారు చెప్పారు. అయితే మాంసాహారులలో గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువ అంటున్నారు అధ్యయనాలు. 50 వేల మంది పై చేసిన అధ్యయనంలో 2,820 మందికి గుండె జబ్బులు రాగా వెయ్యి మంది స్ట్రోక్ కు గురయ్యారు శాఖాహారులు ఆరోగ్యం విషయంలో శ్రద్ధగా ఉండాలంటున్నారు.