ఎంత జాగ్రత్తలు తీసుకున్నా మొహం పై బ్లాక్ హెడ్స్ వస్తూనే ఉంటాయి. వీటిని సహజమైన పద్ధతిలో సులభంగా పోగొట్టవచ్చు. చర్మం పైన అతి ముఖ్యమైన ప్రోటీన్ కొలాజెన్ విడుదల మెరుగుపరచడంలో దాల్చినచెక్క ప్రముఖ పాత్ర పోషిస్తుంది. చర్మం పైన ఏర్పడే రంద్రాలు తగ్గిస్తుంది. నిమ్మరసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంపైన రంధ్రాలు శుభ్రం చేస్తాయి. అంచేత అర చెక్క నిమ్మరసం టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో పూతలా వేసి 15 నిమిషాలు తేలికగా మర్దన చేసి చల్లని నీటితో కడిగేస్తే బ్లాక్ హెడ్స్ పోతాయి. చర్మం చక్కగా మెరుస్తుంది కూడా.

Leave a comment