పురుషులతో పోలిస్తే ఆందోళన సమస్య మహిళలలోనే రెండింతలు ఎక్కువ అంటున్నాయి అద్యాయినాలు. ఈ రీసెర్చ్ రిపోర్టు ప్రకారం 12 మిలియన్ల మంది మహిళలు ప్రపంచ వ్యాప్తంగా డిప్రెషన్ బారిన పడుతున్నారు. 10 నుంచి 15 శాతం తల్లులు పోస్ట్ పార్డమ్  డిప్రెషన్ కు లోనవ్వుతూ వుంటారు. 9 శాతం మహిళలు ప్రసవం తర్వాత కలిగే పోస్ట్ పార్డమ్ డిప్రెషన్ కు గురవ్వుతున్నారు. పురుషులు అతంహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకుంటే మహిళలు వాళ్ళ కంటే రెండింతలు ఎక్కువ మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. డిప్రెషన్ కు చికిత్స తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది.అసలు చికిత్స తీసుకోవలసిన ప్రాబ్లమ్  వుందని వాళ్ళకు తెలియదు.  ప్రిస్క్రిప్షన్ సరిగా ఫాలో అవక, మందులు వేసుకోక ఎంతో మంది మహిళలు విపరీతమైన అనారోగ్యానికి గురై ఆత్మ హత్య ఆలోచనలు చేస్తారు. ఈ విషయంలో చికిత్స 80 శాతం రిజల్ట్ ఇస్తుంది.

Leave a comment