Categories
మాసాబసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు వెలుగు దీపాల్ని, మొక్కల్లో ఇమిడ్చి చూపించారు. అంటే వాటర్ క్రెస్ అని పిలిచే ఒక రకం మొక్కల్లోకి నానో స్ధాయి కణాలు ఒప్పించి చీకట్లో వాటిని నాలుగు గంటల పాటు వెలిగేలా చేసారు. ఇంకాస్త పరిశోధనా చేస్తే ఈ మొక్కలతో మరింత కాలం వెలుగు నింపచ్చంటున్నారు. భవిష్యత్తులో ఈ మొక్కల్ని వీఎది దీపాలు లాగా. ఇళ్ళల్లో వెలిగే దీపాల్లాగా వాడుకోవచ్చన్నమాట. మిణుగురుల్లో వెలుగుకు కారణమైన లూసీ ఫెరన్ కణాలను పది నానో మీటర్ల సైజులో వుండే సిలికా కణాలతో కలిపి మొక్కల ఆకుల్లోకి ఎక్కించారు. అక్కడ జరిగే రసాయిన క్రియతో మొక్కలు వెలిగిపోయాయి.