ఇంటి హాల్లో నాలుగు మూలల నాలుగు ఫ్లవర్ వాజ్ లు అందులో తాజా పువ్వులు ఉంటే చాలు అవి ఇంటికి అందం. ఇప్పుడు అచ్చం పువ్వుల్ని పోలిన ఆర్టిఫిసియల్ ఫ్లవర్స్ ఆకులు వస్తున్నాయి.ఎప్పుడు వాడిపోకుండా తాజాగా ఉంటాయి. కనుక అవి అందమే. కానీ ఫ్లవర్ లాంపులు అయితే అచ్చం పూల మొక్కలా,నిండా విరిసిన పువ్వుల్లో పగలంతా అందం ఇస్తాయి రాత్రయిపోగానే వాటిలో నుంచి ఎల్ ఈడీల ద్వారా వెలుగులు విరజిమ్ముతాయి.ఈ ఫ్లవర్ ట్రీ డెస్క్ లాంప్ లు ఏ గది కైనా అందమే.కాంతి కోసం మనం వాడుకునే బెడ్ లైట్లకు బదులుగా ఇటు అలంకరణకు అటు వెలుగు ఇచ్చేందుకు ఉపయోగపడేలా ఉన్నాయి.ఈ వెలుగు పువ్వులకోసం ఆన్ లైన్ లో వెతకవచ్చు.

Leave a comment