మేఘాలయలోని కాంగ్ తోంగ్ గ్రామాన్ని సింగింగ్ విలేజ్ అని పిలుస్తారు. ఈ గ్రామం చుట్టు ఉన్న అడవి లోంచి పక్షులు ,కిలకిలా రావాల కంటె మనుషులు పాడే పాట వంటి భాషతో మార్మోగుతుంటాయి. నిజమే ఇక్కడి వాళ్ళకి పేర్లుంటాయి. కానీ ఆ పేరు కంటే ఒక్క బిడ్ద ఈ గ్రామంలో జన్మించగానే ఆ బిడ్డ తల్లి తన పాపాయి కోసం ఒక కొత్త ఆలపన సృష్టిస్తుంది. ఆమెప్పుడు తన బిడ్డను ఆ పాట తినే పిలుస్తుంది.ఎప్పుడైన కోపం వస్తే బిడ్డను అసలు పేరుతో పిలిచి కోప్పడుతుంది. ఇది వాళ్ళ పూర్వికుల నుంచి వచ్చిన ఆచారం అని చెభుతారు.ఇక్కడ మాతృస్వామ్యం నడుస్తుంది. అంటే ఆ గ్రామంలో ఆడ పిల్లలకు తల్లి నుంచి ఆస్తి సంక్రమిస్తుంది. మగవాళ్ళు కుటుంబ పెద్దే అయినా ఆస్తి స్త్రీకే చెంది ఉంటుంది. ఈ గ్రామం ప్రత్యేకత ఏంటంటే ప్రతి మనిషికి పేరు లాగా ఒక పాట ఉండటం. అలా పాటలోనే పిలుపులు కనుక ఎప్పుడు పాటలతోనే ప్రతిధ్వనించే ఈ గ్రామాన్ని సింగింగ్ విలేజ్ అని పిలుస్తారు.

 

Leave a comment