ఈ ప్రకృతి అపురూపంగా ఇచ్చిన ఎన్నో వస్తువులను మనం కష్టపడి కూడా తినలేం. చేదుగా వుండే వేపాకునో నష్టానికి అంటే పచ్చిమిర్చి నో మంచివన్నా సరే ఇష్టం తినగలమా ? అలాంటివాటి లిస్ట్ లో వెల్లులి కూడా ఒకటి. ఎన్నో దినుసుల్లో కలిపితే కూరలకు ఘుమాయింపు రుచి వస్తుందేమో కానీ వెల్లులిని ఆలా ముక్కలు చేసి చితక్కొటో  తినగలమా ? అందుకే ఆరోగ్యం తలచుకుని దాన్ని వేయించో  ఉడకబెట్టో తినాలని చూస్తాం. కానీ అలా  వేయిస్తే ఇందులో ఉండే హైడ్రోజన్ సల్ఫయిడ్  సామర్ధ్యం తగ్గుతుందనీ  అందువల్ల అలా  తీసుకుంటే అట్టే ప్రయోజనం కలుగదని  అంటున్నారు నిపుణులు. అదే వెల్లులి పచ్చిగా తినగలిగితే హైడ్రోజెన్  సల్ఫయిడ్ రసాయనాలు వేసే వాహనంగా పనిచేస్తుందని ఇది రక్తనాళాల ద్వారా రక్తం చక్కగా ప్రవహించటానికి సహాయపడుతుందనీ పరిశోధనల్లో వెల్లడైంది. అంచేత ఎలాగోలా పచ్చి  వెల్లులి రోజుకు రెండు మూడు రెమ్మలైన తీసుకోవటం వల్ల  ఫలితాలు పొందవచ్చని చెపుతున్నారు.

Leave a comment