ఎప్పుడూ సందేహించటం కూడా ఒక లాంటి అనారోగ్యమే. అనుమానం పెనుభూతం అన్న పెద్దల మాట నిజమే నంటున్నాయి కొన్ని కొత్త రిపోర్ట్స్. ఈ అనుమానం సామజిక సంబంధాలను దెబ్బ తీయటమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా నష్టం కలిగిస్తుందని పరిశోధనల రిపోర్ట్. కొందరు ఎదుటి వారిని ఎప్పుడూ అనుమానిస్తూ ఉంటారు. వారిపైన అపనమ్మకం పెంచుకుంటారు. దీనివలన  మానసిక అశాంతి కలగటమే తాకకుండా జ్ఞాపక శక్తి  సన్నగిల్లే ప్రమాదం ఉందని ఫిన్లాండ్ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అభద్రతా భారం మహిళల్లోనే ఎక్కువగా ఉంటుందనీ ఈ విషయాన్నీ దీర్ఘకాలం పరిశోధించి రిపోర్ట్ రూపొందించామన్నారు. ఎదుటి వారిని అనుమానించే మహిళల్లో చిత్త వైకల్యం వచ్చే అవకాశం మూడు రెట్లు  ఉందన్న విషయం వీరి పరిశోధనల్లో వెల్లడైంది. రిపోర్ట్ విషయం ఎలా ఉన్న  అనుమానం అసూయ అగ్నికంటే శక్తిమంతమైనవనీ ఈ అభద్రత తో బాధపడటం అనారోగ్యాలకు మానవ సంబంధాలకు దెబ్బ తీసేందుకు కారణమౌతాయని నిస్సందేహంగా చెప్పవచ్చు.

Leave a comment