మ్యూజిక్ మనసుతో వింటే నిశబ్దం. చెవులతో మాత్రం వింటే శబ్దం అన్నాడో కవి. నిజంగానే సంగీతమా ఒక స్వాంతన సంగీతం ఒక అనాధ హేల. ఇంత గొప్ప సంగీతం వినటం ద్వారా గుండె ఎంతో ఆరోగ్యాంగా ఉంటుందని లయబద్దమైన సంగీత సుస్వరాలకు  మనసు స్వాంతన చెందటం  ద్వారా వత్తిడులకు దూరంగా ఉండచ్చని పరిశోధన వెల్లడైంది. రోజుకో అరగంట పాటు సంగీతం వినాలని దానితో మానసిక ప్రశాంతత తో పాటు రక్త నాళాలు సాఫీగా మారతాయని పరిశోధనల సారాంశం. 200 మంది గుండె జబ్బున్న రోగులకు లీనులవిందైన సంగీతాన్ని వినిపించి తర్వాత వారి రక్త ప్రసరణ తీరు పరిశీలించారు . మంచి సంగీతం విన్నాక రక్త ప్రసారణా తీరు మెరుగుపడగా రక్త ప్రసరణ లో విడుదల అయ్యే నైట్రిక్ యాసిడ్ రక్తనాళాల్లో గడ్డలను అవరోధాలను తగ్గిస్తోందన్న విషయం గమనించారు. అయితే ప్రశాంతమైన సంగీతం మాత్రమే వినాలనీ  హోరు వాయిద్యాల ద్వారా సంగీత ధ్వని వింటే ఒత్తిడి మరింత పెరిగే అవకాశం వుందన్న  విషయం కూడా గుర్తించారు. మంద్ర స్థాయిలు సాగే సంగీతం ఆరిథమ్  లో మంచి ఫలితం పొందవచ్చునని చెపుతున్నారు.

Leave a comment