నీహారికా,

పాజిటివ్ ధింకింగ్ సరే కానీ దేన్నెయినా పాజిటివ్ ఎలా తీసుకోవాలి అన్నావు చాలా కరెక్ట. ముందు మన చుట్టూ ప్రతికూల వాతావరణం లేకుండా చూసుకోవాలి. ఎలా అంటే మన స్నేహితుల్లో కొందరు ఇప్పుడు ఇతరుల్లో లోపాలు ఎంచేవాళ్ళు ఉన్నారు అనుకుందాం, మొదటిగా వాళ్ళకు దూరంగా వుండాలి. చుట్టూ వుండే వాతావరణం మనసు పైన ప్రభావం చూపెడుతుంది. ఎక్కువ సేపు ప్రక్రుతిలో గడిపితే ఆ ఫీలింగ్ ఆత్మవిశ్వాసం తో పాటు పాజిటివ్ నెస్ ను పెంచుతుంది అంటారు ఎక్స్ పర్ట్స్. మరి అంత సమయం ప్రకృతి లో గడిపడం సాధ్యమా అనుకుంటే ముందు మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఏం చేస్తున్నాం? ఏం చేయాలి ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఎలా మెలగాలి. ఒక చిన్న మాటతో అవతలి మనిషి మొహం లో చిరునవ్వు పోయిన విషయం మనకేం అనిపించింది. ఒక మనిషిని కాస్త సంతోష పెడితే ఆ ఆనందం మనకెంత సేపు సంతోషంతో వుంచింది ఇదే పాజిటివ్ ఫీలింగ్స్ ని అలవరచుకునే పద్దతి. ఒక సారి ఈ దిశగా ఆలోచించడం మొదలు పెడితే అలవాటుని ప్రతి అంశాన్ని పాజిటివ్ గా చూసే శక్తిని ఇస్తుంది. ఇష్టమైన పనులు చేస్తే మానస్సు ఆనందంగా వుంటుంది. పాజిటివ్ గా వుండటం జీవితంలో ఒక భాగం అయిపోతుంది.

 

Leave a comment