వివాహ బంధానికి బీటలు పడుతున్నాయా ?

సహజీవనానికి యువత సరే అంటున్నారా ?

లివ్ ఇన్ రిలేషన్ షిప్ ఇవాల్టి ఫ్యాషనా ?

ఒక సర్వే రిపోర్ట్ ఎం చేపుతోందంటే 20 వ శతాభ్ధపు యువత దృష్టిలో మ్యారేజ్ ఒక ఫెయిల్డ్ ఇన్స్టిట్యూషన్.

సహజీవనం ఒక కామా ,

ఆర్ధిక స్వాతంత్ర్యం సాధించిన ఆడపిల్లలకు ఈ రెండు బంధాల పట్లా ఎప్పుడు అపనమ్మకమే స్త్రీలకు భద్రత వివాహ బంధంలో దొరకదని, సహజీవనం దానికి సరైన సమాధానమని అనుమానిస్తారు . వివాహ బంధంలో కనుమరుగవుతున్న మానసిక బాధకు ఈ ఆలోచనకు కారణం అవుతోంది. ఈ సర్వేలో విద్యావంతులు చాలామంది పెళ్ళంటేనే భయం అన్నారు. మంచి చదువు, ఉద్యోగం అద్భుతమైన జీవితం స్వేచ్చకు పెళ్ళితో అర్ధాలు మారిపోతాయంటారు. సంవత్సరాల తరబడి చదువులకోసం విదేశాలలో వుండటం, ఫ్రెండ్స్ తో ఒకే  ఫ్యామిలీగా కలసివుండటం, ఒకేచోట ఉద్యోగం ఒకే ఆఫీసులో పని ప్రతీ దాన్ని షేర్ చేసుకోవడం ఇవన్ని పెళ్ళితో పోతాయని భయం. నిజానికి ఈ భూమి పైన పెళ్లి అనేది ఒక అందమైన బంధం, నమ్మకం, అర్ధంచేసుకోవడం ఈ బాంధవ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం పెళ్ళైన ఇద్దరి వ్యక్తుల మధ్య ఉండాల్సిన  ఒక అవగాహన. సహజీవనం కలసిజీవించాలనుకొన్న ఇద్దరు వ్యక్తుల మధ్య అవసరమైన ఒక స్పేస్ ను సృష్టిస్తుంది. భాద్యతలు ఇతరుల పై మోపని ఒక స్వేచ్చ ఈ బంధాన్ని కాపాడుతుంది. కలం మారింది కొత్త తరం కొన్ని సమస్యలు ఎదుర్కొంటోంది. ప్రేమ, నమ్మకం పునాదిగాలేని వివాహబంధం ఎంతో ,స్వార్ధంతో కూడిన సహజీవనం కూడా అంతే సమాజం పట్ల భాద్యతగల యువత తమపట్ల తమకు ఉండవలసిన గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక నిర్ణయాన్ని తీసుకోవలసిన తరుణం ఇదే ! జీవితం బావుండాలి. ఒక తీయని కలలా ఉండాలి!!

మీరేమంటారు !!

Leave a comment