ఇంటి అందాన్ని పెంచేందుకు తీగ మొక్కలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. గోడా ,మెట్లు ఏదో ఒక దాన్ని ఆధారంగా చేసుకుని చక్కగా పరచుకునే ఈ తీగ మొక్కల వల్ల పూల కర్టెన్ లా వేసినంత అందం వస్తుంది.బోగన్ విలిమా,డెవిల్స్ ఐవీ, కర్టెన్ క్రీపర్ ఆల్మండ్ వంటి తీగ మొక్కల్ని పెంచడం కూడా సులువే మనీ ప్లాంట్ గా పిలిచే హృదయాకారంలో ఉండే ఆకులు పసుపు తెల్ల ఈనెలతో చూసేందుకు అందంగా ఉంటుంది. రోజు మార్చి రోజు నీరుపోసిన చాలు పెద్ద పోషణ సంరక్షణ అవసరం ఉండదు. కర్టెన్ క్రీపర్ అయితే గోడలను పాకేస్తే చక్కగా పూలు పూస్తూ అందంగా ఉంటుంది. ఎక్కువ సూర్య రశ్మి వుంటే ఆల్మండ్ బోగన్ విలియా లు కూడా ఇంటికి చక్కని అందాన్నిస్తాయి.

Leave a comment