నీహారికా,

చదువు అయిపోతానే  ఏదో ఒక స్టార్టప్ మొదలు పెడతానన్నావు. మంచిదే అయితే నీ లక్ష్యం నిజం కావటానికి కొద్దిగా మోటివేషన్ లేదా, ఏం చేయదలుచుకున్నావో దానిపైన పట్టూ. ప్రతి ఒక్కరికి చిన్నవో, పెద్దవో ఏవో కొన్ని లక్ష్యాలుంటాయి. అవి బర్తీచేసేందుకు తెలివితేటలూ కావాలి. డబ్బు సరైన కనెక్షన్లు కావాలని ఇంకోదరు చెప్పారు. అయితే లక్ష్య సాధన కోసం ఇవన్ని కావాలి అన్నిటికంటే ముక్యమైనది చాలా మంది నిర్లక్యం చేసేది రిపోర్ట్లు. ఇవి మనమే సమకూర్చుకోవాలి. మన శక్తి, యుక్తులు సమకోర్చుకోవాలి. సమస్యలకి పరిష్కార మార్గాలు ఏముంటాయో అంచనా వేసి ఆలోచిన్చిపెట్టుకూవాలి. సమస్యలు ఏముంటాయి. అనకు. నీ లక్ష్య సాధన దిశలో సమస్యలు ఎదురైతే దానికో పరిష్కారం దొరికే దిశగా నీ ఆలోచనలు ఉండాలని ఉద్దేశం. అందుకే ఓపెన్ మైండ్ తో అనుక్షణం అన్వేషణ కొనసాగించాలి. శక్తి వంతమైన మార్గం ఎంచుకోవాలి. అంతే గాని ఆ దారిలో భయాలు, అప నమ్మకాలు, సందేహాలు ఉండరాదు. ముందస్తు హెచ్చరికగా అసలు వెనుకడుగు వేయవద్దు. నీ అడుగు ముందుకే.

Leave a comment