ఏ వ్యయామం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్నో వీడియోలు చెప్పేస్తాయి. కానీ అవన్నీ నిష్ణాతులైన గురువుల దగ్గర సరిగ్గా వేయటం నేర్చుకోవాలి. పొత్తి కడుపులో పేరుకున్న కొవ్వు తగ్గాలంటే క్రంచెస్ ని మించిన వ్యయామం లేదని చూస్తాం. కానీ క్రంచెస్ వల్ల కండరాలు పటుత్వం పెరుగుతోంది కానీ కొవ్వు కరగదంటున్నారు ఎక్స్ పర్ట్స్. క్రంచెస్ కంటే ప్లాంక్స్ ,బ్రడ్జెస్ చేయడం వల్ల ఫలితం ఉంటుందంటున్నారు. కోర్ ఎక్సర్ సైజ్ గా క్రంచెస్ ని ఉపయోగించాలంటే సరైన భంగిమ అనుసరించాలని లేక పోతే వెన్ను వంకర తిరిగి నొప్పి మొదలయ్యే ప్రమాదం ఉంటుందని పరిశోధకులు చెపుతున్నారు. ఏ వ్యాయామం అయినా ఎక్స్ పర్ట్స్ పర్యవేక్షణలో నేర్చుకొని మరీ సొంతంగా చేయవచ్చుంటున్నారు.

Leave a comment