తల్లో చుండ్రు మొదలైందంటే ముందుగా జుట్టురాలడం, తెల్లని పొట్టు, దురదా లాంటి సమస్యలన్నీ వచ్చి పడతాయి. ఇంట్లో వుండే వస్తువులతోనే చుండ్రుకి అద్భుతమైన చికిత్స చేయచ్చు. కలబందలో యంటి ఫుంగల్ గునలుంటాయి. దీన్ని మాడుకు రాసుకుని మర్దన చేసుకోవాలి. అరగంట ఆగి తేలికైన షాంపూ తో తల రుద్దుకుంటే సమస్య కంట్రోల్ లోకి వస్తుంది. రెండు స్పూన్ల వంట సోడాలో కాసిన్ని నీళ్ళు కలిపి తలకు రాసుకోవాలి. ఓ అరగంట ఆగి తేలికైన షాంపూ తో తలస్నానం చేస్తే మాడు పై వున్న మ్రుతకనాలు రాలిపోతాయి. చుండ్రు క్రమంగా వదిలి పోతుంది. వేపాకులు మెత్తగా గ్రైండ్ చేసి పిండి పావు కప్పు రసం వచ్చేలాగ తీసుకోవాలి. అందులో కొబ్బరి పాలు, బీట్ రూట్, కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించినా సమస్య పోతుంది. కొబ్బరి నూనె నిమ్మరసం కలిపి తలకు రాసుకున్నా సరే గంటసేపాగి కడిగేస్తే సమస్య దూరమైపోతుంది.
Categories