మాస్లిన్ కాటన్ అనే పేరుతో పిలిచే మల్ కాటన్ చీరలు వేసవికి చాలా అనువైనవి. పర్షియా భాష లో మల్ మల్ అనే పదానికి కాటన్ వ్యల్ అనే అర్థం ఉంది. పేరు తగ్గట్లే ఇవి మెత్తగా సౌకర్యంగా ఉంటాయి. ఈ వస్త్రం పై సహజసిద్ధమైన మెరుపు పోకుండా వేర్వేరు చక్కని రంగులు అద్దుతారు. చెమటను పీల్చే గుణం ఉండటం వల్ల వేసవిలో ఇవి విపరీతమైన ఆదరణ పొందుతాయి. సున్నితంగా చల్లని నీళ్లలో ఉతికి నీడలోనే ఆరవేస్తే మెరుపు పోకుండా ఉంటాయి ఈ తేలికపాటి కాటన్ ప్రింటెడ్ చీరలు చాలా తక్కువ ఖరీదుకే లభిస్తాయి.

Leave a comment