వేసవి ఎండకు ముందుగా ఎఫెక్ట్ అయ్యేది జుట్టే ఎండలో పిచు లాగా అయిపోతుంది. లేదా చెమటకి తడిసి తలస్నానం చేసినా సరే కాసేపటికే జిడ్డుగా అత్తుక్కుపోతుంది. రెండు చిరాకే ఇలాంటప్పుడు రసాయినాల జోలికి పోవడం కంటే హోం మేడ్ చిట్కాల వైపు వెళ్ళడం బెటర్ ఒక పెద్ద చెంచా ఆపిల్ సైడర్ వేనిగర్ తీసుకుని దానికి తగినన్ని నీళ్ళు కలిపి, తలకు రాసి పావుగంట ఆగి కడిగేస్తే చాలు. ఇంక తలస్నానం ఏ షాంపూ తో చేయనక్కరలేదు. గుడ్డులో తెల్ల సోన కుదుళ్ళ నుంచి పట్టించి, అరగంట తర్వాత తలస్నానం చేసినా జుట్టు చెక్కగా వుంటుంది. బాగా పండిన అరటి పండు గుజ్జు లాగా చేసి దానికి కాస్త ఓట్స్ పొడి కలిపి తలకు రాసుకుని అరగంట పాటు ఆరనిచ్చి తలస్నానం చేస్తే జుట్టు పట్టు లాగా మెరుస్తుంది. ఒక విటమిన్-ఇ మాత్రను బాదాం నూనెలో కలిపి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి కాసేపాగి కడిగేస్తే పొడిపొడిగా సిల్క్ లాగా మెరుస్తుంది. మైల్డ్ షాంపూ ఎంచుకుంటే మేలు. ఘాడత వున్న షాంపూలు జుట్టును పొడి చేస్తాయి.
Categories