ఎండలోచిస్తున్నాయి ఎండ నుంచి రక్షణ కోసం గొడుగులు చర్మం పాడవకుండా సన్ స్క్రీన్ లు కాదు శరీరం చల్లబడే ఆహారం కూడా తీసుకోవాలి . ఇప్పుడు పుచ్చ కాయల సీజన్ మొదలైంది. ఇందులో మొత్తం నీదే. యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దాహం తీరుస్తాయి. కానీ కోసి ఫ్రిజ్ లో నిలువ చేయద్దు. అలాగే కొబ్బరి నీళ్లు కూడా మంచి ఆహారం. ఈ నీళ్లలో సహజ చక్కెరలు ఖనిజాలు అధికంగా ఉంటాయి. పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీలు ఎక్కువగా తీసుకోవాలి . శరీరం డీ హైడ్రేషన్ కు లోనవకుండా కాపాడతాయి. ఈ కాలంలో పెరుగు మజ్జిగ వాడకం ఎక్కువ చేయాలి. ఎండలోకి వెళ్ళే ముందర మజ్జిగ తాగాలి. కూరలు మసాలాలు ఎక్కువ టీయూస్కుని పెరుగన్నం తినటం అన్ని విధాలా మేలు. అలాగే పుదీనా కూడా వేసవిలో తీసుకునే ఆహారాల్లో ఉండాలి. తీపి మొక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు ల్యూటిన్ వంటివి ఎక్కువ. కీరా దోసకాయ కూడా తప్పనిసరిగా తీసుకునే పదార్ధాల జాబితాలో చేర్చాలి.
Categories