తన వందో పుట్టిన రోజునాటికి వందమంది చిన్న పిల్లల్ని సంతోష పెడదాం అనుకుందిట అమెరికా కు చెందిన లిల్లియన్ వెబర్. ఈ వందేళ్ళ భామ్మ టీ.వి చూస్తుంటే లిటిల్ డ్రెస్సెస్ ఫర్ అమెరికా అనే స్వచ్చంద సంస్థ గౌన్లను సేకరించి ఆఫ్రికా దేశాల్లోని ఆడ పిల్లలకు అందిస్తున్నాదాని తెలిసింది. కొన్ని గౌన్లు కుట్టి ఆ సంస్థ కు పంపిందీ వెబర్. ఒక్క సారి ఈ మాత్రం పంచితే ఇంత సంతోషం వస్తే రోజు గౌన్లు కుట్టి ఇవ్వగలిగితే అలా తన వందో పుట్టిన రోజు నాటికీ వెయ్యి గౌన్లు ఇవ్వగలిగితే ఇంకెంత సంతోషం అనుకుంది వెబర్. రోజుకో గౌన్ కుడుతుంది. అదీ ఎదో మూసగా పని చేయడం కాదు. ప్రతీదీ అందంగా ఆకర్షనీయంగా వాటికీ అందమైన పూసలు, గుండిలు కుట్టి ప్రతి గౌను అందంగా తీర్చి దిద్ది తన లక్ష్యం పూర్తి చేసిందిట ఈ వందేళ్ళ భామ్మ. జీవితంలో ఎదో ఒక లక్ష్యం వుంటే, అదీ ఎదుట వాళ్ళకి ఉపయోగ పడి మనకు సంతోషం ఇస్తే ఆ సంతోషం మనకు ఆయుష్షు పోస్తుంది. సందేహమే లేదు. వందేళ్ళ వెబర్ మనస్సులో బీద పిల్లల పట్ల ఎంత ప్రేముందో????????
Categories
Gagana

వెయ్యి గౌన్లు కుట్టి పేద పిల్లల కిచ్చిన భామ్మ

Leave a comment