రేగి వడియాలు తిన్నారా? రేగి పండ్లు కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడైనా ఒత్తిడిగా, ఆదుద్దాగా అనిపించినప్పుడు రెండు రేగి పండ్లు తింటే ఎంతో ఫలితం వుంటుంది. రేగి పండ్లలో వత్తిడి తగ్గించే గుణాలున్నాయి. రేగి పండ్లలో విటమిన్-సి, ఏ పొటాషియం అధికం. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాలేయానికి చాలా మంచిది. చర్మానికి చాలా మేలు చేస్తాయి. వృద్దాప్యా ఛాయల్ని దూరం చేస్తాయి. జీర్న వ్యవస్థ తిరును ఎంతగానో మెరుగు పరుద్తుంది. కాలరీలు చాలా తక్కువే. బరువు పెరిగే భయం కూడా వుండదు. శరీరానికి తక్షణ శక్తి అంది అలసట మాయమైపోతుంది. సీజన్ అయిపోయే వరకు రోజు తిన్నా మంచిదే. కాల్షియం, పాస్పరస్, పుష్కలంగా దొరికే ఈ రేగి పళ్ళు తినడం తో ఎముకులు, దంతాలు ధృఢ పడతాయి. పుల్లని , తియ్యని రుచిలో వుండే ఈ రేగు పళ్ళు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
Categories