ఒక కోట్లకు పడగలెత్తిన కుటుంబంలో యువతి పెళ్లి గురించి చాలా కొత్తగా ఆలోచించారు. తన స్తాయికి తగట్టు విందులు, వినోదాలు ఆడంబరాలు అన్ని అవతల పెట్టి తన పెళ్లి ఖర్చులతో నిరుపేదలకు నీడ నివ్వాలని కోరుకుంది. ఆమె మహారాష్ట్ర లోని ఓరంగాబాద్ జిల్లా కు చెందిన శ్రీయ ముహర్. ఆమె అత్తింటి వాళ్ళు భర్త, అత్త మామలు ఆమె ఆశయానికి మద్దత్తు పలికారు. పెళ్ళికి  అయ్యే ఖర్చు తో 108 ఇల్లు నిర్మించి ఇవ్వాలనుకున్నారు. పెళ్లి నాటికి 90 ఇల్లు పూర్తయ్యాయి. ఆ పేద కుటుంబాల వారికి పెళ్ళికి ఆహ్వానించి కళ్యాణ మండపం లోనే ఇళ్ళకు సంబందించిన తాళాలు వాళ్ళకు అందజేసి అందరి ఆశీర్వాదాలు అందుకున్నారు. తన పెళ్లి తన జివితం లోనే కాకుండా మరెన్నో కుటుంబాలలో సంతోషం నింపాలని కోరుకుంది శ్రీయ ముహర్.

Leave a comment