కాశీలోని వారణాసి వారాహి దేవిని ఈ రోజు తలచుకుని భక్తులను దయ తలచమని ప్రాధేయపడదామా వనితలూ!!

వారాహిదేవి ఉగ్ర రూపంలో దర్శనం ఇస్తుంది.దుర్గా దేవి అంశమే ఈ వారాహి.సప్త మాత్రుకలలో ఒకరు.అమ్మవారికి తాంత్రిక పూజలు నిర్వహిస్తారు. పగలు దేవి నిద్రలో వుంటారని సూర్యోదయానికి ముందే నైవేద్యం సమర్పణ చేస్తారు.క్షేత్రపాలకుడిగా కాలభైరవుడు రక్షిస్తాడు.విష్ణు మూర్తి నుంచి వైష్ణవి,బ్రహ్మ నుంచి బ్రాహ్మిణి,విష్ణు మూర్తి అవతారం వరాహమూర్తి నుంచి వారాహిదేవి ఉద్భవించినదని పురాణ గాథ.
అమ్మవారి దర్శనం రెండు రంధ్రాలలో నుండి చేసుకోవాలి.ఎదురుగా చూచిన అమ్మ ఉగ్ర రూప శక్తిని భరించలేము.మొదటి రంధ్రం ద్వారా ముఖ దర్శనం రెండవ రంధ్రం ద్వారా పాద దర్శనం చేసుకోవాలి.
లోకా సమస్తా సుఖినో భవంతు.
నిత్య ప్రసాదం: కొబ్బరి,నిమ్మకాయల దండ

         -తోలేటి వెంకట శిరీష

Leave a comment