Categories
అమెరికన్ సోషియోలాజికల్ అసోషియేషన్ చేసిన ఓ సర్వేలో కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ఉన్న ఇళ్ళలో పెరిగిన వాళ్లు విడాకులు తీసుకొనేందుకు సుముఖంగా ఉండరట. అక్క చెల్లెళ్ళు,అన్నదమ్ములూ ఎక్కువ మంది ఉన్నా ఇళ్ళలో కలిసి పెరిగిన వాళ్ళలో ప్రేమానుబంధాలు ,పంతాలు ,పట్టింపులు,వెంటవెంటనే సర్ధుబాట్లు పట్టువిడుపులు ఉంటాయి. ఈరకమైన నైపుణ్యాలతో పెరిగిన వాళ్ళు పెళ్ళిళ్లు చేసుకొన్న భార్యభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చిన ఆ సంసారం విచ్చిన్నం కాకుండా ఉంటుంది. వైవాహిక జీవితంలో సర్ధుకుపోతారు. ఒక్కళ్ళుగా పెరిగిన ఇళ్ళలో ఇలాంటి సర్ధుబాటు లు ఉండవు అంటున్నారు పరిశోధకులు.