Categories

గాయత్రీ చక్రవర్తి స్పివాక్ నోబెల్ తో సమానమైన హోల్బర్గ్ ప్రైజ్ అందుకున్నారు కోల్ కతాకు చెందిన 82 ఏళ్ల గాయత్రి ప్రముఖ సాహితీ విమర్శకురాలు కార్నెల్ విశ్వవిద్యాలయంలో పి హెచ్ డి చేశారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో మానవీయ శాస్త్రాలలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఈమె పరిశోధనలు 20 పైగా ఇతర భాషల్లోకి అనువదించారు. 1986 నుంచి పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ సరిహద్దుల్లో నిరక్షరాస్యులకు ఉచిత విద్య అందించారు గాయత్రి. గ్రామీణ పేద ప్రజలకు ఉచిత విద్య అందించినందుకు గాను నార్వే ప్రభుత్వం గాయత్రి కి హోల్బర్గ్ ప్రైజ్ ను దీనితో పాటు 4. 6 కోట్ల నగదు బహుమతిని అందిస్తోంది గాయత్రి జూన్ 20వ తేదీన ఈ పురస్కారం అందుకుంటారు.