కాంతివంతమైన చర్మం కోసం ఎన్నో రకాల క్రీములు, లోషన్లు, యాంటి ఏజింగ్ సీరమ్ లు, నైట్ క్రీములు, తెలిసినవాన్ని వాడేసి ముఖం అందంగా వుండేలా శ్రద్ధ తీసుకుంటారు కానీ మెడ వెనక నుంచి వీపు దాకా వుండే చర్మం మాటేమిటి? ఇప్పుడు ఫ్యాషన్ దుస్తులు వేసుకునే టప్పుడు ఎన్నో రకాల బ్యాక్ లెస్ టాప్ లు ధరించినప్పుడు మెడ వెనుక నల్లని మరకలతో ట్యాన్ తో, చిన్న పొక్కులు, మచ్చలు, మోటిమల తో కనిపిస్తూ వుంటే, వేసుకున్న డ్రెస్ అందం కాస్త పోతుంది. ముఖం పైన వచ్చే మచ్చలు, మరకలే మెడ కింద, మెడ పైన, మొహం పైన కంటే ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తాయి. వీపు విషయంలో కూడా మెడ పైన తీసుకున్నంత శ్రద్ధ తీసుకోవాలి. ముందుగా తలస్నానం చేసి తల శుభ్రంగా కడిగేసి ముడి పెట్టేసి విపు శుభ్రం చేసుకోవాలి. వాష్ క్లోత్ తో స్క్రబ్ చేయాలి. ప్రతి రోజు స్నానం సమయంలో లూఫా, బాడీ బ్రష్ వాడి తేలికైన సబ్బుతో స్క్రబ్ చేస్తే చర్మ రంధ్రాల్లోని మురికి పోతాయి చర్మం మొహం లా మెరుస్తుంది. ఫ్యాన్సీ క్రీములు అక్కర్లేదు. కానీ రోజు బేబీ ఆయిల్ రాసుకున్నా సరిపోతుంది. బ్యాక్ లెస్ టాప్ ధరించినా బాగుంటుంది.
Categories