బరువు ఎక్కువ గా ఉంటే తెలివి తేటలూ కాస్త తక్కువే అంటున్నారు పరిశోధకులు . ముఖ్యంగా ఈ వ్యవస్థ పిల్లల్లోనే ఎక్కువ ఉంటుందని చెపుతున్నారు . లావుగా ఉన్న పిల్లలు తరచు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు . ఈ పిల్లలు ఆటపాటల్లో కూడా చురుగ్గా ఉండనికారణం కేవలం ఈ బరువు వల్లనే అంటున్నారు . అధిక బరువుతో ఉండే పిల్లలు విద్యాలయాల్లో చురుగ్గా ఉండరని వారి ప్రవర్తన కాస్త అసాధారణంగా అయిపోతుందని అంటున్నారు . ఈ బరువుతో ఉండే పిల్లలు ఆత్మన్యూనతతో అందరికంటే బరువు గా వెక్కిరింతలకు గురవుతామనే ఆలోచనలో ఉండి మిగతా విషయా ల్లో వెనుక బడతారని పరిశోధకులు చెపుతున్నారు . ఈ పిల్లల దృష్టిని  వ్యాయామం వైపు ఆటపాటల వైపు  ఎలాగైనా మళ్ళించాలంటున్నారు .

Leave a comment