Categories
పిల్లలకు డబ్బు విలువ తెలియజెప్పడం మంచిది అంటారు ఎక్స్ పర్ట్స్. దీనికి ఫలానా వయసన్న నియమం లేదు. స్కూలుకి వెళ్లే వయసు నుంచి టీనేజ్ వారి వరకు డబ్బు గురించిన అవగాహన ఖచ్చితంగా ఉండాలి. డబ్బు ఎలా వస్తున్నా దాన్ని ఎలా ఖర్చు చేయాలన్న మనీ మేనేజ్ మెంట్ పిల్లలకు వారి వయసుకు తగ్గట్లు వివరించాలి.వారి వయసు దృష్టిలో ఉంచుకుని వారికి పాకెట్ మనీ ఇవ్వడం మొదలుపెట్టాలి. దాన్ని ఖర్చు చేయడం విషయంలో వారు ఎలా జాగ్రత్తగా ఉండాలో వివరంగా చెప్పాలి.వాళ్ళు ఎదిగే కొద్ది డబ్బు విలువ అవసరాల పట్ల అవగాహన అప్పుడు వాళ్ళకు కలుగుతాయి.