ఎనిమిది దశాబ్దాల క్రిందట ముంబాయ్ లో బిఎస్సి పూర్తి చేసిన కమలా సోహాని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేస్తే ఆమెకు ప్రవేశం లభించలేదు. ఆడవాళ్లు సైన్స్ పరిశోధన ఏం చేస్తారని నోబెల్ గ్రహీత ఆ సంస్థ అధ్యక్షుడు సి.వి.రామన్ ఆమె దరఖాస్తు రిజెక్ట్ చేశారు. కమలా ఆయన ఆయన ఆఫీస్ ముందు సత్యాగ్రహం చేసి ఆయన పెట్టిన షరతులు ఒప్పుకొని ఐఐఎస్‌సీ లో ప్రవేశం పొందింది. ఆ తర్వాత సైన్స్ లో పీహెచ్‌డీ చేసిన తొలి మహిళ గా రికార్డ్ సృష్టించింది. స్త్రీలకు అంత తేలికగా ఏది లభించలేదని చెప్పేందుకు ఈమె ఉదాహరణ. అలాగే వాళ్ళు దేనినైనా సాధించగలరని చెప్పేందుకు ఈమె ఉదాహరణ.

Leave a comment