Categories
టెలిస్కోప్ తొలి చిత్రం చూడగానే సంతోషంతో తబ్బిబ్బు అయ్యాను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లో కీలకమైన ఎన్ ఐ ఆర్ క్యామ్ పరికరానికి బాధ్యత వహించడం ఒక రోలర్ కోస్టర్ రైడ్ వంటిది. నేను చూసిన అంతరిక్ష చిత్రాలు ఉర్సా మేజర్ నక్షత్రాల కూటమి కి చెందినవి.18 నక్షత్ర చిత్రాలు ఈ రాకెట్ లాంచ్ లో నేను భాగం అయినందుకు ఎంతో గర్వంగా ఉంది అంటోంది డాక్టర్ మార్సియా జె రైకే 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం చీకటిలో పుట్టిన ఈ విశ్వాంతరాళపు ఆనవాళ్లు, రహస్యాల తాజా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వెలుగులోకి తెచ్చింది. ఈ చారిత్రక టెలిస్కోప్ కెమెరాను అమెరికాకు చెందిన 70 ఏళ్ల మహిళ ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ మార్సియా జె రైకే రూపొందించడం విశేషం గత డిసెంబర్ లో ఈ టెలిస్కోప్ అంతరిక్షంలోకి చేరుకుంది.