Categories
చాలాసేపు మెలుకవగా ఉండటం టీవీనో ఫేస్ బుక్ తోనో కాలక్షేపం చేస్తే ఏ అర్ధరాత్రి వేళలో ఆకలితో ఫ్రిజ్లు డబ్బాలు వెతికేవాళ్ళకి ఈ అలవాటు మెడదు పనితీరును పాడు చేస్తుందని పరిశోధకులు చెపుతున్నారు. ఈ అలవాటు ఎప్పటి కప్పుడు పొట్టని నిండుగా ఉంచినా జ్ఞాపక శక్తి పైన నిద్రపైనా ప్రభావం చూపెడుతోందని అంటున్నారు. శరీరమనే యాంత్రానికి విశ్రాంతికి అవసరమని అస్తమానం కడుపులోకి తీసుకోనే ఆహారాన్ని అరిగించే విధంగా జీర్ణకోశం నిరంతరం పని చేసి పాడైపోతుందని హెచ్చరిస్తున్నారు. భోజనం నిద్ర శృంగారం పని వీటన్నింటీకీ ఒక ప్రత్యేక సమయం కేటాయించుకొని ఆరోగ్యంగా ఉండమని సలహా ఇస్తున్నారు.