Categories
మన నాలుక్కి రుచి ఇచ్చేవే ఫ్యాషన్ ట్రెండ్ అయితే బావుండదు. 2018 సంవత్సరపు పువ్వుల డిజైన్ లలో చెర్రీ పండుకు చోటిచ్చింది. చెర్రీ పూల ప్రింట్ గౌన్ లు చెవి రింగులు నెక్లెస్ లు ఉంగరాలు,హాండ్ బ్యాగ్ లు చెర్రీ పూల చెప్పులతో ఫ్యాషన్ ప్రపంచం మొత్తం ఈ రుచిగా మెరిసిపోయే పండుని తను లేటెస్ట్ డిజైన్ గా మార్చేసింది. ఎంబ్రయిడరీ షర్టు కు మూలన చెర్రీ పండ్లు గుత్తి వేలాడటం కూడా ఫ్యాషన్ అన్నట్లు అన్నింటికీ జతగా చెర్రీ పండ్ల డిజైన్ హాట్ కూడా వచ్చి చేరింది. ఈ కొత్త చెర్రీ ప్రింట్స్ ఫ్యాషన్ ని యూత్ రెండు చేతులా స్వాగతించారు.