భారత మహిళ క్రికెట్ జట్టులోకి 2009 లో వచ్చిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పదేళ్ళుగా రాణిస్తుంది. హర్మన్ ప్రీత్ కౌర్ భారత మహిళ టీ20 టీమ్ కెప్టెన్. విదేశీ లీగ్ లలో ఆడిన తొలి భారతీయ మహిళ. పంజాబ్ లోని మోగా అనే చిన్న పట్టణం హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఊరు. గత సంవత్సరం అర్జున అవార్డు తీసుకొందామే. పంజాబ్ ప్రభుత్వం ఈ మధ్యనే ఆమెకు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది. మన దేశంలో మహిళ క్రికెటర్లకు బ్యాట్ ఎండార్స్ మెంట్ హర్మన్ ప్రీత్ కౌర్ తోనే మొదలైంది. సియట్ సంస్థతో ఈమధ్యనే రెండేళ్ళ ఒప్పదం కుదిరింది. వెస్టిండీస్‌లో ఈ ఏడాది చివర్లో జరిగే టీ20 ప్రపంచకప్‌ సాధించడమే తన తర్వాతి లక్ష్యమంటోంది హర్మన్‌ప్రీత్‌ కౌర్‌.

Leave a comment