ఈ మధ్య పండుగలు వరుసగా వస్తుండటం తో ఉపవాసం ప్రసక్తి కుడా వినిపిస్తుంది. కనీసం పూజ ముగిసే వరకన్నా ఉపవాసం తో వుండాలి. అదీ కష్టం అంటారు. నీరసం అంటూఉంటారు కానీ డాక్టర్స్ మాత్రం, ఉపవాసం దేవుడి పేరు చెప్పి అయినా సరే చేయడం మంచిదే అంటారు. ఒక్క పూత ఆహారం తీసుకోకపొతే శక్తి సన్నగిల్లి పోవడం అంటూ వుండదు. న్యాయంగా మనం తినే ఆహారం తినగానే మనకు శక్తిని ఇవ్వలేదు. అది అడిగి గ్లూకోజ్ గా మారి కాలేయం, కండరాళ్ళు శరీరంలోని ఇతర భాగాలలో నిల్వవుంటుంది. ఒక వేల ఏ పూట అయినా శరీరానికి ఆహారం అందాకా పొతే ఈ నిల్వ వున్న గ్లూకోజ్ ను శరీరం ఉపయోగించుకుంటుంది పైగా ఉపవాస దీక్షలో భాగంగా పరిమిత ఆహారానికి కట్టుబడటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి కుడా. మధుమేహం, కోలెస్ట్రోల్, రక్త పోతూ, గుండె కొట్టుకునే వేగం  ఇవన్నీ కంట్రోల్ లో ఉంటాయని పరిశోధనలు చెప్పుతున్నాయి.

Leave a comment