మంచి కూరలు, సంబార్లు, పులిహోరలు, దేన్లో అయినా ఉప్పు వేయకుండా ఊహించండి. అస్సలు తిండే వద్దు బాబు ఏవో కంద మూలాలు తిని బతికేయచ్చు అనిపిస్తుంది. మరి డాక్టర్లేమో ఉప్పు అనారోగ్యం, బీ.పి పెరుగుతుంది, పక్షవాతం గుండె పోటు వగైరాలు పరుగెత్తుకుంటూ వచ్చేస్తాయి అంటారు కదా. ఒక అద్భుతమైన రిపోర్టు వచ్చింది. ఉప్పు ఎక్కువ తినడం వల్ల రక్తపోటు లో నమోదయ్యే తగ్గుదల చాలా నామ మాత్రం. ఉప్పు వల్ల రక్త పోటు స్వల్పంగా పెరుగుతుందని మాత్రమే శాస్త్రీయమైన ఆధారాలున్నాయి. కనుక డాక్టర్లు బీ.పి ఎక్కువైతే ఉప్పు తగ్గించమంటారు. అంతే కానీ ఉప్పుతో గుండెపోటు పక్షవాతం ఇలాంటి వేమీ వచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఒక రిపోర్టు తేల్చింది. అంచేత మరీ హడలి పోయి చప్పిడి తిండి తో జిహ్వను చంపేసుకోవలసిన పనిలేదు. హాయిగా రుచిగా ఉప్పేసుకొండి అనేసాయి అధ్యాయినాలు. ఇప్పటికిది బెస్ట్ అధ్యాయినం.