ప్రతి ఒక్కరు దృఢమైన మనస్సుతో పుట్టారు. అందరికీ విమర్శలను తట్టు కొనే శక్తి ఉండదు. ఊరికే ఎవరినీ నొప్పించేలా మాట్లడకండి. అంటూ పోస్ట్ చేసింది జైరా వశీమ్.దంగల్ సీక్రెట్ సూపర్ స్టార్ ది స్కై ఈజ్ పింక్ చిత్రాల్లో నటించిన జైరా వశీమ్ చాలా సున్నితమైన మనసున్న అమ్మాయి అంటారు. ఆమెను తలిచిన వాళ్ళు ఎదుటి వాళ్ళు తెలిసో తెలియక మాట్లాడే మాటలు ఎంతో నొప్పిస్తాయి. పదిమందిలో వేసే జోక్స్ ఒక్కసారి భరించలేక పోతాము అంటోంది జైరా వశీమ్. ఇది చాలా కరెక్ట్ నిజంగానే మన చుట్టు ఉన్నవాళ్ళు ఎందరో తమ స్నేహితులు,పరిచయస్తుల పైన ఎన్నో జోక్స్ వేస్తారు. వెక్కిరిస్తారు. ఆ నిముషంలో ఆ జోక్ కి రెస్పాన్స్ వస్తుంది. గానీ ఆ వెక్కిరింతకు గురయిన వాళ్ళు బాధపడతారు కదా. దాన్ని ఎంతమంది గుర్తిస్తారు ?

Leave a comment